Top 10 Mind Blowing Facts About Indian Temples || మీకు తెలియని 10 ఆశ్చర్యకర ఆలయాలు || With Subtitles
SUBSCRIBE TO PLANET LEAF :- https://goo.gl/RR0KVV
SUBSCRIBE TO SLATE KIDS :- https://goo.gl/OFUfuc
SUBSCRIBE TO TFC SPIRITUAL :- https://goo.gl/anQFRb
SUBSCRIBE TO PLANET MOJO :- https://goo.gl/91hwWS
FOLLOW US ON SOCIAL MEDIA
FACEBOOK - https://goo.gl/9nah8Q
TWITTER - https://goo.gl/jpw19v
GOOGLE+ - https://goo.gl/TuwAQm
Blogger - https://goo.gl/mKEIe4
SCOOP IT - https://goo.gl/yKaf2o
TUMBLER - https://goo.gl/xI2385
REDDIT - https://goo.gl/tbAjsV
Some of the beautiful Ancient Temples in India that will take you back in time...
We have learnt in Indian history that temples in ancient times were once social hubs where people congregated. They were also sites where the arts of dance, music and combat were honed and have been passed down for generations. Today, these temples remind us of our past and the architectural brilliance of craftsmen in those days.
1. ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.
2. కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది. ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.
3. ధర్మపురి (తమిళనాడు) మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .
4. కరూర్ (కోయంబత్తూర్) సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.
5. గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.
6. కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది. కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.
7. చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు పంచలోహ విగ్రహము కాదు కేవలం
కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది. ఆశ్చర్యం కదా.
8. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది.ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.
9. కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.
10. విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.
11. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.
12. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది. పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం. గడియారం చూసుకొఖ్ఖర లేదు.
13. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.
14, ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు. ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.
No comments: