Monday 9 May 2022

మహారణా ప్రతాప్ సింగ్ జయంతి శుభాకాంక్షలు


అందరికీ భరతమాత ముద్దుబిడ్డ 'మహారాజు రాణా ప్రతాప్ సింగ్' జయంతి శుభాకాంక్షలు!


ఏడున్నర అడుగుల ఎత్తు, 110 కిలోల బరువు, 80 కిలోల కవచం, పది కిలోల చెప్పులు, 80 కిలోల ఈటె, ఇరు వైపులా పదునుండే కత్తి, మొత్తం కలిపి 217 కిలోల బరువును అవలీలగా మోస్తూ, ఎన్నో యుద్ధాలు గెలిచిన వీరుడు.. ఆయన వాడిన ఈ వస్తువులన్నీ ఉదయ్‌పూర్ మ్యూజియంలో దర్శించవచ్చు.

ఆయనే మహారణా ప్రతాప్ సింగ్.. యోధుడు, వీరుడు అంటే ఇలాగే ఉండాలి అనిపించే రాజసం.. నేడు ఆ మహనీయుడి జయంతి 💐

వియత్నాం విజయానికి స్ఫూర్తినిచ్చిన భారతీయుడు!

ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి, దాని మెడలు వంచి విజయం సాధించిన దేశం, 'వియత్నాం'. అమెరికాపై సాధించిన విజయం తర్వాత, వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేఖరి ఇలా ప్రశ్నించాడు.

మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుబట్టడం లేదు.. ఎలాగో చెప్పగలరా?

ఆ విలేఖరి అడిగిన ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం.. 'శక్తివతంమైన అమెరికాను ఓడించడానికి నేను, గొప్ప దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.. ఆయన జీవితం నుంచి ప్రేరణ పొంది, యుద్దనీతి, ప్రయోగాలతో విజయం సాధించాం' అని అన్నాడు.

'అతడే, రాజస్థాన్‌లోని మేవాడ్ వీరుడు, మహారాజా రాణా ప్రతాప్ సింగ్' అని గర్వంగా ప్రకటించాడు. మహారాణా ప్రతాప్ సింగ్ పేరు చెప్పేటప్పుడు, అతడి కళ్లల్లో వీరత్వం తొణికిసలాడింది. అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే, మేము ఈ ప్రపంచాన్నే జయించేవారమని అన్నాడు. కాలక్రమంలో వియత్నాం అధ్యక్షుడు చనిపోయిన తర్వాత, అతడి సమాధి మీద ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడిదని రాశారు. కొన్నేళ్లకు వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి విచ్చేశాడు. దేశంలోని గొప్పవారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఆయనకు మొదట గాంధీ సమాధి చూపించారు. ఆ తర్వాత ఎర్రకోట, ఇలా చూపించేటప్పుడు వియత్నాం మంత్రి, మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ? అని ప్రశ్నించాడు.

ఆ మంత్రి ప్రశ్నకు ఆశ్చర్యపోయిన భారత అధికారి, ఉదయపూర్‌లో ఉందని తెలిపాడు. ఆయన ఉదయ్‌పూర్ వెళ్లి సమాధిని దర్శించి, అక్కడి నుంచి పిడికెడు మట్టిని తీసుకుని తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. దీనిని గమనించిన భారత అధికారి, మట్టిని బ్యాగ్‌లో ఎందుకు పెట్టుకున్నారని అడిగాడు.. ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులకు జన్మనిచ్చింది.. అందుకే దీనిని తీసుకెళ్లి, మా దేశం మట్టిలో కలుపుతాను. ఇలాంటి రాజు ప్రేరణతో, అక్కడ కూడా దేశ భక్తులు జన్మిస్తారని.. మహారణా ప్రతాప్ సింగ్ గురించి ఈ దేశం మాత్రమే కాదు, ఆయన యావత్ ప్రపంచం గర్వించదగ్గ రాజని అన్నాడు.

రాజపుత్ర వీరుడు మహారణా ప్రతాప్ సింగ్, 1540, మే 9న, రాజస్థాన్‌లోని కుంభల్‌ లో జన్మించారు. 1568 లో, మేవాడ్ పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన మహారాణా, 1597 వరకు పరిపాలించాడు. గొప్ప చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొన్న అక్బర్, ఆ సమయంలో ఢిల్లీ సింహాసనాన్ని పాలిస్తున్నాడు. స్వాతంత్య్రం, ఆత్మ గౌరవం కోసం నిరంతరం మొఘలులతో పోరాటం చేస్తూ, మహారణా ప్రతాప్ సింగ్ ఏనాడూ, ఎవరి ముందూ తలవంచలేదు. మహారాణా ప్రతాప్ ఒకసారి తలదించి తన కాళ్ల మీద పడితే, సగం హిందూస్థాన్‌కు రాజును చేస్తానని అక్బర్ ప్రతిపాదిస్తే, దాన్ని తుచ్ఛమైనదిగా తిరస్కరించాడు.

ఒకసారి భారత్ పర్యటన కోసం అబ్రహాం లింకన్ సిద్దమవుతుండగా, తన తల్లిని తిరిగొచ్చేటప్పుడు ఆమెకోసం ఏం తీసుకురావాలని అడిగాడు. దానికి ఆమె, రాజస్థాన్‌లోని మేవాడ్ నుంచి పిడికెడు మట్టి తీసుకురా.. అని మహారణా ప్రతాప్ సింగ్ గురించి చెప్పిందట. అయితే, కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దయ్యింది. ఈ విషయాలను, 'బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యుఎస్ఏ‌'లో పేర్కొన్నారు.

మహారాణా ప్రతాప్, ఏడున్నర అడుగుల ఎత్తు ఉండేవారు. అల్ బరౌని అనే రచయిత, మహారణా ప్రతాప్ సింగ్ దగ్గర ఉన్న రాంప్రసాద్ అనే ఏనుగు గురించి, తన పుస్తకంలో వ్రాశాడు. మేవాడ్ మీద యుద్దం చేసేటప్పుడు, మహారాణా ప్రతాప్‌తో పాటు, అతడి ఏనుగు రాంప్రసాద్‌ను కూడా బందీగా పట్టుకుంటే సరిపోతుందని, అక్బర్ తన సైన్యంతో అన్నాడు. రాంప్రసాద్ మొఘలులకు చెందిన 13 ఏనుగులను హతమార్చింది. అలాగే, దానిని బంధించడానికి, 7 పెద్ద ఏనుగులమీద, 14 మంది నైపుణ్యం కలిగిన మావటి వాళ్ళు చక్రవ్యూహం పన్నారని, అల్ బరౌని తన రచనలో పేర్కొన్నాడు. బంధించిన రాంప్రసాద్‌ను అక్బర్ ముందు నిలబెడితే, దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడతను. అయితే, ఆ ఏనుగు 18 రోజుల వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ప్రాణత్యాగం చేసింది. తర్వాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్, ఒక ఏనుగునే వంచలేకపోయాను. ఇక మహారాణాను ఎలా వంచగలుగుతాను? అని అన్నాడట.

మన ధర్మాన్ని మనం కాపాడుకుందాము. ఆ ధర్మమే మన భావితరాలను సురక్షితంగా ఉంచుతుంది. ధర్మో రక్షతి రక్షితః

No comments: