రాత్రి సమయంలో దెయ్యాలు పూజలు చేసే శివాలయం గురించి మీకు తెలుసా?
ఈ భూమి మీద అత్యంత పురాతన నాగరికతగా, మన సనాతన ధర్మానికి పేరుంది. అందుకే ఇక్కడ ఉన్న రహస్యాలు మరెక్కడా లేవని చెప్పడంలో, ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా, మన దేశంలో ఉండే పురాతన ఆలయాలు, కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, మన పూర్వీకుల నిర్మాణ కౌశలానికీ, నేటి తరం ఆధునిక శాస్త్రానికి కూడా అందని మర్మ విద్యలకూ, ఇప్పటికీ వీడని ఎన్నో రహస్యాలకూ, ఆలవాలం అని చెప్పవచ్చు. అంతేకాదు, నాడు అనేక ఆలయాలను నిర్మించిన మన పెద్దలు, ఒక్కో ఆలయానికి ఒక్కో నియమం కూడా పెట్టడం జరిగింది. వాటిలో కొన్ని వేదాను సారం పెట్టిన నియమాలైతే, మరికొన్ని, కారణాలు తెలియని రహస్య నియమాలుగా మిగిలిపోయాయి. అయితే, ఎవరైనా ఆ రహస్యాల వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకోడానికి, ఏదైనా ఆలయంలో నియమాలను ఉల్లంఘిస్తే, వారు ఎన్నో తీవ్ర ఇబ్బందుల పాలైనట్లు, చరిత్ర స్పష్టంగా చెబుతోంది. అటువంటి వింత నిమాయాలున్న ఆలయాలలో, రాత్రి వేళ మనుషుల సందర్శనను పూర్తిగా నిషేధించిన ఆలయం కూడా ఒకటి. దాదాపు వెయ్యేళ్ళ క్రితం నిర్మించిన ఆ ఆలయానికి, రాత్రి సమయంలో వెళ్ళిన వారిని దెయ్యాలు పిడిస్తాయంటున్నారు. ఈ మాటలు వినగానే, గుడికి వెళ్తే దెయ్యాలు పీడించడం ఏమిటి? అలాంటి వింత దేవాలయం ఎక్కడుంది? అసలు ఆ ఆలయ చరిత్ర ఏమిటి - వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. మరి ఆ సందేహాలన్నీటికీ సమాధానం తెలియాలంటే, ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి.
మన సనాతన భారత దేశంలో, ఎన్నో పురాతన ఆలయాలు నేటికీ ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని శిధిలావస్థలో ఉండగా, మరికొన్ని భక్తుల కోర్కెలు తీర్చే ఆలయాలుగా, సనాతన హైంధవ ధర్మాన్ని కాపాడే పట్టు కొమ్మలుగా భాసిల్లుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత ఆలయం మాత్రం, దాదాపు వెయ్యి సంవత్సరాలుగా అటు మనుషుల కోర్కెలూ, ఇటు దెయ్యాల కోర్కెలూ తీర్చే ఓ వింత ఆలయంగా ప్రసిద్దికెక్కింది. అంతేకాదు, ఆ ఆలయానికి ఉండే మరో విశేషం, దాని నిర్మాణ సమయం నుంచి నేటి వరకూ, ఓ శిధిలమైన ఆలయంగానే ధర్శనమివ్వడం అని, నిపుణులు చెబుతున్నారు. ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న ఆ ఆలయం గురించి తెలుసుకోవాలంటే, ముందు అది ఎక్కడుంది? ఆ క్షేత్ర స్థల పురాణం ఏమిటి? వంటివి తెలుసుకోవాలి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, Sihoniya అనే గ్రామానికి అతి సమీపంలో ఉన్న Kakanmath అనే ఆలయమే, ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న ఆ వింత ఆలయం. చూడగానే, ఎప్పుడు కూలిపోతుందా! అని అనుకునే విధంగా ఉండే ఈ ఆలయంలో, త్రిమూర్తులలో ఒకరైన పమేశ్వరుడు లింగ రూపంలో ప్రతిష్టించబడి, మన దేశంలో ఓ ప్రముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇక్కడ ప్రతి రోజు ఉదయం స్వామి వారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, సుదూర ప్రదేశాల నుంచి భక్తులు శివయ్యను దర్శిండానికి వస్తుంటారు. పగలంతా అటు భక్తులతో, ఇటు ఆ పురాతన కట్టడాన్ని చూడటానికి వచ్చే సందర్శకులతో ఎంతో సందడిగా ఉండే Kakanmath ఆలయంలో, రాత్రైతే సెక్యూరిటీ గార్డుతో సహా, ఎవ్వరూ అక్కడ ఉండరు. అంతేకాదు, రాత్రి వేళలో అటువైపు పశుపక్షాదులు కూడా రావని, స్థానికులు చెబుతునారు. ఈ వింత వెనుక ఉన్న అసలు కారణం తెలియాలంటే, ముందు ఆ స్థల పురాణం గురించి తెలుసుకోవాలని, అక్కడి అధికారులు చెబుతున్నారు.
Kakanmath ఆలయాన్ని, పెద్ద పెద్ద రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించడం జరిగింది. అయితే, ఆ రాళ్ళు అతుక్కుని ఉండటానికి ఎటువంటి పదార్ధాలనూ ఉపయోగించలేదు. అంతేకాదు, Kakanmath ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్ళు, Sihoniya కి చుట్టుపక్కల ఎక్కడా లేవనీ, వాటిని దాదాపు వంద మైళ్ళ దూరం నుంచి తెచ్చి నిర్మించి ఉంటారనీ, నిపుణులు చెబుతున్నారు. స్థానికులు మాత్రం, వేరే కధను చెప్పడం విశేషం. కొన్ని శతాబ్దాలుగా వినిపించే అక్కడి ప్రజల కధలలో, జానపదాలలో, Kakanmath ఆలయాన్ని, దెయ్యాలు నిర్మించినట్లు చెబుతున్నారు. పూర్వం ఆ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణం లేదనీ, ఒక రోజు అక్కడికి వెళ్ళిన స్థానిక ప్రజలు, రాత్రికి రాత్రి అక్కడ ఆలయ నిర్మాణం జరిగినట్లు గురించారని చెబుతారు. అంత పెద్ద ఆలయాన్ని ఒక్క రాత్రిలో ఎలా నిర్మించారని ఆలోచించిన అక్కడి ప్రజలు, అది ఖచ్చితంగా ఏ దేవతలో, లేదా మరేదెనా శక్తులో కట్టి ఉండొచ్చని భావించారు. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి, స్థానిక ప్రజలు అటువైపు వెళ్ళగా, వారిని దెయ్యాలు పట్టి పీడించి, చంపేశాయనీ, అప్పటి నుంచి Kakanmath ఆలయాన్ని దెయ్యలే నిర్మించాయనీ, రాత్రులు అవి శివయ్యకు పూజలు చేస్తాయనీ, Sihoniya ప్రజలు విశ్వసించడం ప్రారంభించారు. అందువల్లనే నేటికీ అక్కడి ప్రజలు, రాత్రి వేళలో Kakanmath పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా జంకుతారు.
అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశ ప్రభుత్వం, Kakanmath ఆలయం చుట్టూ ఉన్న కధల గురించీ, అక్కడ జరుగుతున్న విషయాల గురించీ క్షుణ్ణంగా తెలుసుకోవాలని, కొంతమంది అధికారులను కూడా నియమించడం జరిగింది. వారు Sihoniya ప్రాంతానికి వచ్చి, Kakanmath ఆలయాన్నీ, ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలనూ క్షుణ్ణంగా పరిశీలించి, ఒక రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం, Kakanmath ఆలయాన్ని, దాదాపు వెయ్యేళ్ళ క్రితం, Kachchhapaghata అనే రాజ వంశానికి చెందిన Kirttiraja అనే రాజు నిర్మించాడనీ, ఆ ఆలయానికి అతని భార్య అయిన Kakanavati లేదా Kakanade పేరు పెట్టినట్లు, పొందు పరచబడి ఉంది. ఎటువంటి సిమెంటు, ఇసుకా వాడకుండా, ఒక రాయిపై మరో రాయిని ఎంతో మెదస్సును ఉపయోగించి నిర్మించడం జరిగిందనీ, ఆ టెక్నాలజీ నేటి తరం వారికి అంతగా తెలియదనీ, అందులో చెప్పబడి ఉంది.
అంతేకాదు, మొదట్లో ఈ ఆయాలం బాగానే ఉండి ఉండవచ్చనీ, కొన్ని వందల సంవత్సరాల క్రితం, అక్కడ సంభవించిన ఓ భూకంపం ధాటికి, Kakanmath ఆలయం శిధిలమైందనీ, అప్పటి నుంచీ, ఎప్పుడు కూలిపోతుందా అని అనిపించే ఆ ఆలయం, ఇన్నేళ్లయినా, అలా నిలబడి ఉండటం ఓ వింతనీ, అధికారులు ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే, Kakanmath ఆలయాన్ని పరిశోధిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన అధికారులు, రాత్రి సమయంలో ఆలయం నుంచి ఏవో వింత శబ్ధాలు రావడం గమనించామనీ, అక్కడ ఏదో ఉందనే భావన కలిగిందనీ, కంటికి మాత్రం ఏమి కనపడలేదనీ, తమ రిపోర్ట్ లో పొందుపరిచారు. అంతేకాదు, నాడు Kakanmath ఆలయం దగ్గర రాత్రి సమయంలో పరిశోధనలు జరిపిన అధికారులు, ఆ తరువాతి కాలంలో ఎన్నో మానసిక సమస్యలను ఎదుర్కొన్నట్లు, కొన్ని కధనాలు ఆ మధ్య కాలంలో వెలువడ్డాయి. ఏది ఏమైనా, Kakanmath ఆలయం నేటికీ ఓ Mysterious Temple గా ప్రసిద్ధి గాంచింది.
ఓం నమః శివాయ!
No comments: